స్వచ్ఛతే సేవాభావం
టేకులపల్లి, (విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాల(Government Junior College) టేకులపల్లిలో శనివారం NSS ఆధ్వర్యంలో ‘స్వచ్ఛతా హి సేవా భావ్’ కార్యక్రమాన్ని(Swachhata Hi Seva Bhav Program) నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థినీ, విద్యార్థులు కళాశాల పరిసరాలను శుభ్రం చేశారు. చుట్టుపక్కల ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి, ఉపయోగకరమైన మొక్కలను నాటారు.
కళాశాల ప్రాంగణంలో నిలిచిన మురుగు నీటిని పారద్రోలారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే సమాజానికి అందించే గొప్ప సేవ అని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎం. పవన్‌కుమార్, NSS ప్రోగ్రాం అధికారి బానోత్ బాబురావు, అధ్యాపకులు సత్యవతి, బసవమ్మ, ముంతాజలి, శంకర్‌రావు, వేణుగోపాల్, శ్రీనివాస్‌రావు, యాకూబ్, వరలక్ష్మి, ప్రమోద్‌కుమార్, సంజీవరెడ్డి, అధ్యాపకేతర సిబ్బంది బిక్షం, అశోక్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.