పేదల ఆరోగ్య రక్షనే.. ధ్యేయంగా వైద్య శిబిరాలు
జవహర్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం
జవహర్ నగర్,(విజయక్రాంతి): పేదల ఆరోగ్య రక్షణ ధ్యేయంగా పనిచేస్తామని గడ్డం రాజ్ కుమార్ పేర్కొన్నారు. స్మైల్ ఫౌండేషన్ సహకారంతో యూనివర్సల్ హ్యుమానిటీ చారిటబుల్ ట్రస్ట్(Universal Humanity Charitable Trust) ఆధ్వర్యంలో బీజేఆర్ నగర్ మామిడి తోటలో ఉచిత వైద్య శిబిరం(Free medical camp) నిర్వహించారు. ఈ శిబిరంలో జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ వైద్య నిపుణులు డాక్టర్ గడ్డం రాజకుమార్, జె. గౌతమీ, మెడ శిరీష, సీహెచ్‌ఓ ఎండీ సాదిక్ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సూచనలు అందించారు.
పేద, మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నారు.శిబిరాన్ని విజయవంతం చేయాలని డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ పిలుపునివ్వగా, ట్రస్ట్ ప్రతినిధులు కొలిపాక సాయికిరణ్, కొలిపాక కళ్యాణి ఏర్పాట్లను సమన్వయం చేశారు.