ఈనెలాఖరులో లబ్ధిదారుల ఎంపిక
19-09-2026 | 06:32pm
హైదరాబాద్: క్యూర్ పరిధిలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల(double bedroom housing scheme)పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) సమీక్షించారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను పూర్తి చేశామని, క్యూర్ పరిధిలో 21 వేల డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు పారదర్శకంగా లాటరీ ద్వారా లబ్ధిదారులను ఈనెలాఖరులో ఎంపిక చేయాలని, భవనాలకు 7 కిలోమీటర్ల లోపు ఉన్నవారినే ఎంపిక చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
డబుల్ బెడ్ రూం ఇళ్లల్లో అనర్హులను తొలగించాలని, ప్రభుత్వం కేటాయించిన ఇళ్లల్లో ఉండని వారికి ఇల్లు రద్దు చేయాలని ఆదేశించారు. క్యూర్ పరిధిలో స్థలం ఉన్న 9 వేల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు.