నానో ఫర్టిలైజర్ ఎరువులతో పంటలకు అధిక ప్రయోజనం

19-09-2026 | 10:39pm

కొమురవెల్లి,(విజయక్రాంతి): నానో ఫర్టిలైజర్(Nano-fertilizers) ఎరువులతో పంటలకు అధిక ప్రయోజనాలు ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి వెంకట్ రావమ్మ తెలిపారు. శనివారం మండలంలోని గౌరయిపల్లి  గ్రామానికి చెందిన నరెడ్ల శ్రీనివాస్ రెడ్డి రైతుకు చెందిన వరి పంటలో ప్రయోగాత్మకంగా నానో యూరియా ఎరువు(Nano urea fertilizer)ను డ్రోన్ ద్వారా పిచికారి చేయించారు.

అనంతరం ఆయన ఆమె మాట్లాడుతూ... నానో ఫర్టిలైజర్ ఎరువులు అన్ని రకాల పంటలకు తగిన మోతాదులో వాడుకోవచ్చని తెలిపారు. వరి, మొక్కజొన్న, కంది తదితర పంటలకు ఎంతో యుక్తంగా ఉంటుందన్నారు. నానో ఎరువులను లేబుల్ పై ఉన్న మోతాదులోనే పిచికారి చేసుకోవాలని తెలిపారు. నానో ఫర్టిలైజర్ లో యూరియా, డి ఏ పి, పొటాష్ తదితర ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొచ్చు  రాజు యాదవ్, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు