యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ఆక్టావ్ సంస్థల చేయూత

19-09-2026 | 10:52pm

అరుంధతి నగర్ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన

జవహర్ నగర్,(విజయక్రాంతి): మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కీసర సర్కిల్ చంద్రపూరి డివిజన్ పరిధిలోని అరుంధతి నగర్ ప్రాథమిక పాఠశాల(Arundhati Nagar Primary School)లో 'యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ 'ఆక్టావ్‌' సంస్థల(United Way of Hyderabad Octave Organizations) ఉమ్మడి సహకారంతో అభివృద్ధి చేసిన మౌలిక వసతుల ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది. పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నూతన సదుపాయాలను ఈ సందర్భంగా అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ కార్యక్రమం అనంతరం పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో హైదరాబాద్ మేనేజర్ అమర్నాథ్ యాదవ్, ఆస్మా,  మాట్లాడుతూ... విద్యార్థుల మానసిక, మేధో వికాసానికి అవసరమైన నైపుణ్యాల  అభివృద్ధిపై తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు, ఇతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే స్థానిక బస్తీ యువకులు కె. విక్రమ్, శ్రీను, బబ్లు, నరేంద్ర, పి. మహేష్, కె. మహేష్, నరసింహ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.

మరిన్ని వార్తలు