ప్రీ ప్రైమరీ పాఠశాల చిన్నారి విద్యకు తొలి అడుగు
19-09-2026 | 11:10pm
బోథ్,(విజయక్రాంతి): ప్రీ ప్రైమరీ పాఠశాల చిన్నారి విద్యకు తొలి అడుగు అని మండల విద్యాధికారి హుస్సేన్(Mandal Educational Officer Hussain) పేర్కొన్నారు. శనివారం మండలంలోని కుచలాపూర్ గ్రామం(kuchalapur village)లో పాఠశాల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చిన్నారుల్లో పసితనం నుండే విద్యపై ఆసక్తి పెంపొందించాలన్న దృక్పథంతో ప్రభుత్వం ఫ్రీ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రావ్య రాని రణధీర్ పాఠశాల చైర్మన్ టి ప్రమీల ప్రీఫైనరీ టీచర్ కే దీపికతో పాటు గ్రామ సర్పంచ్ నారాయణ ఉప సర్పంచ్ ఎస్ అరుణ్ అంగన్వాడి టీచర్ కళావతి ఆయా రమ్య తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.