సుప్రీంకోర్టులో దానం నాగేందర్ పిటిషన్
19-09-2026 | 07:14pm
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను సవాలు చేస్తూ దానం నాగేందర్(Danam Nagender) సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే శనివారం మధ్యాహ్నం హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఎస్ఎల్పీ దాఖలు చేశారు. ఇదే కేసులో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కేవియట్ ఇప్పటికే దాఖలు చేసినట్లు సమాచారం. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికై కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. దీంతో ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్ లను కొటివేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ నిన్న హైకోర్టు అనర్హత వేటు వేస్తూ తీర్పు వెలువరించింది.