కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

19-09-2026 | 10:36pm

లక్షేట్టిపేట,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) లక్షేట్టిపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన గుర్రాల జయకర్ (40) అనే వ్యక్తి కుటుంబ కలహాల(family dispute)తో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై గోపతి సురేష్ శనివారం సాయంత్రం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం, గత కొంతకాలంగా ఇంటిలో కలహాలు జరుగుతున్నాయని, శుక్రవారం మృతునికి కుటుంబ సభ్యులతో గొడవ జరిగిందన్నారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలున్నారన్నారు. పిల్లలకు పెండ్లిలు అయినట్టు తెలిపారు. శుక్రవారం మృతుడు తన సోదరులకు ఫోన్ చేసి నాకు ఇంట్లో కుటుంబ కలహాలతో ఎప్పుడు గొడవ జరుగుతుందని, నాకు బతకడం ఇష్టం లేదని ఫోన్ చేసి తన ఇంటి ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకున్నాడన్నారు. మృతుడి సోదరుడు గుర్రాల చంద్రమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు