రైతుకు కుసుమ విత్తనాల పంపిణీ

19-09-2026 | 11:00pm

- కద్దరు బట్ట కట్టిన కల్తీ లేని ఆహారాన్ని తినలేక పోతున్నం ఎమ్మెల్యే యాదయ్య.

- జాతీయ తినదగిన నూనెలు -నూనెగింజల మిషన్ (NMEO-OS)ద్వారా పంపిణీ

చేవెళ్ళ,(విజయక్రాంతి): మనిషి కద్దరు బట్ట కట్టిన కల్తీ లేని ఆహారాన్ని తినలేక పోతున్న నేపథ్యంలో జాతీయ తినదగిన నూనెలు - నూనెగింజల మిషన్ (National Edible Oils - Oilseeds Mission) ద్వారా రైతులకు కుసుమ విత్తనాలు చేవెళ్ల శాసనసభ్యులు కాలె యాదయ్య(MLA Kale Yadaiah) పంపిణి చేశారు. ఈ సందర్భంగా ISF-764 (లక్ష్మీప్రియ) రకానికి చెందిన కుసుమ విత్తనాలు రైతులకు అందజేశారు. చేవెళ్ల మండలానికి 15 క్వింటాళ్లు, శంకర్‌పల్లి మండలానికి 15 క్వింటాళ్ల విత్తనాలను కేటాయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... మనిషి ఖద్దరు బట్టలు కట్టిన కల్తీ లేని ఆహారానికి దూరమవుతున్నారన్నారు.

నూనెగింజల సాగును ప్రోత్సహించి సాగు విస్తీర్ణాన్ని పెంపొందించడం ద్వారా దేశంలో మంచి నూనెల ఉత్పత్తిని పెంచవచ్చన్నారు. శంకర్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గోవిందమ్మ గోపాల్ రెడ్డి శంకర్‌పల్లి మండల పార్టీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ సమత వెంకట్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్ చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ వెంకట్ రెడ్డి కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు చింపుల సత్యనారాయణ అడా సురేష్ బాబు వార్డు కౌన్సిలర్లు చేవెళ్ల మండల వ్యవసాయ అధికారి శంకర్ లాల్ శంకర్‌పల్లి మండల వ్యవసాయ అధికారి చైతన్య చంటి వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOs) మానీషా గాయత్రి ప్రతిభ బాలకోటేశ్వర్ మొయినుద్దీన్ బాలకృష్ణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు