రైతు వేదికలో పిఎం కిసాన్ ఉత్సవ్ దివస్
రైతులకు ఆర్థిక భరోసా వ్యవసాయానికి పెట్టుబడి
మేడ్చల్ అర్బన్ అక్టోబర్ 30(విజయక్రాంతి):ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(Pradhan Mantri Kisan Samman Nidhi) (PM-KISAN) పథకం 24 వ విడత నిధులను ఆగస్టు 2026 నుంచి నవంబర్ 2026 కాలానికి గాను గుజరాత్ రాష్ట్రంలోని బంస్కాంత నుంచి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేసిన సందర్భంగా రాయిలాపూర్ రైతు వేదికలో పిఎం కిసాన్ ఉత్సవ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ నేపథ్యంలో పిఎం కిసాన్ పథకం తో రైతులకు అందుతున్న ఆర్థిక సహాయం వ్యవసాయ పెట్టుబడి అవసరాలకు కలుగుతున్న ప్రయోజనాలు,రైతుల సంక్షేమంతో పాటు వ్యవసాయ అభివృద్ధిపై రైతన్నలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో బిజేపి రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు కొండo ఆంజనేయులు ముదిరాజ్.
రాయిలాపూర్,గుర్మాపూర్ గ్రామాల మాజి ఉప సర్పంచ్ లు మెట్టు పెంటారెడ్డి.బొక్క రఘుపతి రెడ్డి, రైతులు సత్తిరెడ్డి, నరసింహారెడ్డి, ధర్మారెడ్డి, రఘురాం రెడ్డి, మోహన్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి, వ్యవసాయ అధికారి(ADA)మాధవరెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి(AEO)నీరజ, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.