స్థలాలు, ఇండ్లు కోల్పోతున్న బాధితులకు టిడిఆర్ లు ఇవ్వాలి
ఘట్ కేసర్, నవంబర్ 4 (విజయక్రాంతి): ఘట్ కేసర్ రైల్వే వంతెన నిర్మాణంలో స్థలాలు, ఇండ్లు కోల్పోతున్న బాధితులకు టిడిఆర్ లు ఇచ్చే విధంగా చూడాలని అఖిలపక్ష నాయకులు బుధవారం ఘట్ కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి(Deputy Commissioner Vani)ని కలిసికోవడం జరిగింది.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ వివరణ ఇస్తూ ఎవరైతే ఇండ్లు స్థలాలు కోల్పోతున్నారు వారి యొక్క వివరాలను వారు ఎంత స్థలాన్ని కోల్పోతున్నారో సర్వే చేయించడం జరిగిందని, త్వరలో సర్వే రిపోర్టు వచ్చిన వెంటనే బాధితులకు నోటీసులు జారి చేసి వారి నుండి అంగీకార పత్రాన్ని తీసుకొని టిడిఆర్ బాండ్లను చెల్లిస్తామని అఖిలపక్ష నాయకులకు హామీ ఇవ్వడం జరిగింది.
అనంతరం అఖిలపక్ష నాయకులు ఘట్కేసర్ రైల్వే వంతెన పనులు, రోడ్డు వెడల్పు కార్యక్రమాలు ప్రారంభమైనప్పుడు ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా నారాయణ గార్డెన్ నుండి ఎదులాబాద్ రోడ్డు వరకు రోడ్డు వేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇట్టి విషయంపై కమిషనర్ సానుకూలంగా స్పందించి డిఈ కి ఇట్టి విషయంపై రోడ్డు వేయటకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు డిప్యూటీ కమిషనర్ కి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్, జేఏసీ చైర్మన్ మారం లక్ష్మారెడ్డి, సిపిఐ. సిపిఎం నాయకులు చింతల యాదయ్య, నార్కట్ పల్లి సబిత, మాజీ వార్డు సభ్యులు కొత్తకొండ వెంకటేష్, జేఏసీ సభ్యులు అల్లు కమలాకర్, ఎండి సిరాజ్, బాధితులు కొమ్మిడి మధుసూదన్ రెడ్డి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.