అకాల వర్షానికి తడిసిన ధాన్యం

04-11-2026 | 10:33pm

సుల్తానాబాద్, నవంబర్ 04 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు(Sultanabad Market Yard)లో బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన వర్షానికి ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం కొంతమేరకు తడిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో కొంత మేరకు నష్టం వాటిల్లిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. ​వర్షానికి తడిసిన ధాన్యాన్ని నిబంధనల పేరుతో తిరస్కరించకుండా, తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రభుత్వమే 'ఏ' గ్రేడ్ మద్దతు ధర ఇచ్చి తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు