మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

04-11-2026 | 10:36pm

టీఎస్ యుటిఎఫ్ 

జగిత్యాల, నవంబర్ 04 (విజయక్రాంతి): జిల్లాలోని కొడిమ్యాల మండలంలో టీఎస్ యుటిఎఫ్(TSUTF) ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు తిరుక్కోవేల శ్యాంసుందర్ మాట్లాడుతూ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల న్యాయమైన కోరికలు, 010 పద్దు కింద ఉపాధ్యాయుల వేతనాలు మంజూరు, సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్, డీఏ బకాయిలను విడుదల చేయాలనీ, టీజీటీ ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు, జి. ఓ. 317 వర్తింపజేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఉపాధ్యాయుల పెండింగ్ బిల్స్ వెంటనే మంజూరు చేయాలని, పి ఆర్ సి ని నివేదిక బహిర్గతం చేసి పి ఆర్ సి ని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అంబటి భూమేశ్వర్, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ వేముల శ్రీనివాస్, మండల అధ్యక్షులు నిసాని మహేందర్, ప్రధాన కార్యదర్శి కొత్తూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు