వరద భాదితులకు భోజనాలు ఏర్పాటు చేసిన తంబళ్ళ రవి
04-11-2026 | 10:35pm
దమ్మపేట, నవంబర్ 04(విజయక్రాంతి): మురసు తుఫాన్(Murasu Cyclone) ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు దమ్మపేట పంచాయతీ నెమలిపేట గ్రామం పూర్తిగా నీటమునిగింది. ఇళ్లల్లోకి నీరు చేరడంతో వంట చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుండడంతో బీజేపీ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకులు తంబళ్ళ రవి, ఫిరోజ్ లు నెమలిపేట వరద భాదితులకు భోజనాలు ఏర్పాటు చేశారు.