కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి

04-11-2026 | 10:26pm

మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

సుల్తానాబాద్, నవంబర్ 04 (విజయక్రాంతి): రాష్ట్రంలో తీవ్రమైన నీటి ఎద్దడి వల్ల విద్యా సంస్థలకు కూడా తాగునీరు అందించలేని దుస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కరువును జాతీయ విపత్తుగా ప్రకటించి, కేంద్రం నుండి నిధులు రప్పించాలని మాజీ ఎమ్మెల్యే సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి(Chada Venkat Reddy) డిమాండ్ చేశారు, బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో నీటి కొరతతో ప్రాజెక్టులు ఎండిపోయి తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.

వాతావరణ మార్పుల వల్ల పంటలు దెబ్బతిని, ఎకరానికి భారీగా కౌలు, పెట్టుబడి పెట్టిన కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ​పంట నష్టపోయిన ప్రాంతాల్లో సర్వే చేయించి పరిహారం అందించాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో చాడ వెంకటరెడ్డి వెంట నాయకులు తాండ్ర సదానందం, సూర్య, మనోజ్ కుమార్, శేఖర్, నవీన్, వీరారెడ్డి పలువురు ఉన్నారు...

​

మరిన్ని వార్తలు