విద్యార్థుల దాహార్తిని తీర్చిన రఫీని సన్మానం చేసిన
పాఠశాల యాజమాన్యం
చేగుంట అక్టోబర్ 09,విజయక్రాంతి : చేగుంట మండలం(చేగుంట మండలం) రెడ్డిపల్లి లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో(Government High School) శుక్రవారం ప్రధానోపాధ్యాయురాలు అధ్యక్షతన సర్పంచ్ నరసింహ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు,ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో ఎన్నో ఏళ్లుగా విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను(Drinking water problem) పరిష్కరించన దాత మహమ్మద్ రఫీ(Mohammed Rafi), మానవత్వానికి మారుపేరుగా నిలిచారురని,పాఠశాలలో నీటి వసతి లేక విద్యార్థులు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని గుర్తించి, తన ఉదార సహకారంతో బోరు వేయించడమే కాకుండా, దానికి మోటారు ఏర్పాటు చేయించి విద్యార్థుల దాహార్తిని తీర్చారు.
విద్యార్థుల అవసరాన్ని గుర్తించి, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధతో తాగునీటి సౌకర్యాన్ని కల్పించడం ఎంతో అభినందనీయమైన సేవ అని అన్నారు,
ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. గంగాబాయి ,ఉపసర్పంచ్ స్వామి,ఉపాధ్యాయులు ప్రభాకర్, నాగరాజు, రాజశేఖర్, సురేష్, గోపాల్, శ్రీదేవి, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.