గడువు ముగిసిన అమ్మకాలు
- కూల్ డ్రింక్స్, తినుబండారాలు విక్రయిస్తున్న దుకాణదారులు..
- వినియోగదారుల ఆరోగ్య భద్రత(Consumer health safety)పై ఆందోళన..
- ఫుడ్ సేఫ్టీ అధికారులు(Food safety officials) ఎక్కడ..?..
కూసుమంచి, అక్టోబర్ 9(విజయక్రాంతి): ఎక్కడ చూసినా కల్తీ.. నకిలీ.. కల్తీ..(Fake and adulterated) అంతేనా..? వస్తువులు, కూల్ డ్రింక్స్(Cold drinks) గడువు ముగిసినప్పటికి జోరుగా విక్రయాలు.. పట్టించుకునే వారే లేరు..? ఎవరి ఇష్టం వాళ్ళదే..? ఎవరి దందా వారిదే..? నామ మాత్రపు తనిఖీలు.. నామ మాత్రపు ఫైండ్లు.. ఇంకేముంది.. ప్రజల ఆరోగ్యం పై భద్రత కరువైంది.. ప్రజారోగ్య పరిరక్షణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారా? పానీయాల విక్రయాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే కూసుమంచి మండల కేంద్రంలోని కొన్ని దుకాణాల్లో గడువు ముగిసిన శీతల పానీయాలు, వస్తువులు, తినుబండారాలను వ్యాపారులు జోరుగా విక్రయిస్తున్నారు. అడిగే వారే లేకపోతే అంతా మాదే అన్నట్లుగా వ్యాపారులు ఇష్టానుసారంగా విక్రయాలు చేస్తున్నారు. స్వీట్ దుకాణాల్లో, కిరాణషాపుల్లో, టీ స్టాల్స్లో , చిన్న, పెద్ద దుకాణాల్లో కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ గడువు ముగిసిన బాటిళ్లను యదేచ్ఛగా అమ్మకాలు జరుపుతున్నారు.
శుక్రవారం కూసుమంచి మండల కేంద్రంలోని ఓ దుకాణంలో వినియోగదారుడు మజా బాటీల్ విక్రయించి, బాటిల్ పై డేట్ ను పరిశీలించాడు. గడువు ముగిసిపోయి ఉండటంతో దీనిపై వినియోగదారుడు ఆ దుకాణదారుడిని ప్రశ్నించాడు. కావాలంటే బాటిల్ మార్చుతాం అంటూ నిర్లక్ష్యంగా సమాధానమే చెప్పడం కాకుండా గడువు ముగిసిన బాటిల్ లు తమ షాపులో ఉన్నట్లు తమకు ముందే తెలుసు అనడం కోస మెరుపు.
పానీయాల బాటిళ్లపై ముద్రించిన గడువు తేదీలను పరిశీలించకుండా విక్రయాలు జరిపితే వినియోగదారుల ఆరోగ్య భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు, విద్యార్థులు ఇలాంటి శీతల పానీయాలను ఎక్కువగా వినియోగించే నేపథ్యంలో దుకాణదారులు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుకునే స్థితికి దిగజారారు.
పట్టించుకునే అధికారులేరి..?
కూసుమంచి మండలంలో ఫుడ్ సెప్టీ అధికారుల తనిఖీలు నామమాత్రంగానే ఉన్నాయి. గతంలో ఓ స్వీట్ షాపులో ఫుడ్ లో పురుగులు ఉండటం, ఓ హోటల్ లో కుళ్ళిన కూరగాయలతో వంటలు వండటం లాంటి విషయాలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి. ప్రస్తుతం ఓ హోటల్ లో గడువు ముగిసిన కూలిడ్రింక్స్ బాటిళ్లు దర్శనమిచ్చాయి. ఇలా ఆయా దుకాణదారులు గడువు ముగిసిన పానియాలు, అపరిశుభ్రంగా ఉన్న తినుబండారాలను విక్రయిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటం అడుతుంటే, సంబంధిత అధికారులు ఎక్కడ ఉన్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
నిరంతరం అధికారుల తనిఖీలు చేపట్టాల్సి ఉన్న తనిఖీలు లేకపోవడం, ఆరు నెలలకో, మూడు నెలలకో ఒకసారి నామమాత్రపు తనిఖీలు చేస్తుండటం, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడం పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం.. ఫుడ్ సెప్ఠీ అధికారులు ఇప్పటికైనా స్పందించి తనిఖీలు చేస్తారా..? వేచి చూడాల్సిందే..?