తెలంగాణ ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు వేదిక బతుకమ్మ పండుగ

09-10-2026 | 11:06pm
  1. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
  2. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన పువ్వాడ
  3. తెలంగాణ అస్తిత్వ పండుగల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనత తగదు

(ఖమ్మం, విజయక్రాంతి) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ(Bathukamma Festival) ప్రకృతి ఆరాధనకు, సమస్త ప్రాణకోటికి జీవనాధారమైన ప్రకృతి వైభవానికి ప్రతిరూపమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Puvvada Ajay Kumar) పేర్కొన్నారు. శనివారం నుంచి బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన(The Achievement of Telangana State) కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో(Cultural movement) బతుకమ్మ కీలక పాత్ర పోషించిందని, అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు వేదికగా నిలిచిందని పేర్కొన్నారు.

గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ పండుగకు రాష్ట్ర పండుగగా గుర్తింపునిచ్చి, ఘనంగా వేడుకలు నిర్వహించడంతో పాటు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగకు ప్రభుత్వపరంగా ప్రోత్సాహం తగ్గిందనే భావన ప్రజల్లో ఉందని అన్నారు.

తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే పండుగల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షించరని పేర్కొన్నారు. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ వేడుకలను తెలంగాణ ఆడపడుచులు సంప్రదాయబద్ధంగా ఆటపాటలతో, ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకోవాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు