లైబ్రరీ, ఫైర్‌ స్టేషన్‌ కోసం ఆమరణ దీక్ష

05-10-2026 | 01:40pm

లక్షెట్టిపేట, అక్టోబర్ 5 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నూతన లైబ్రరీ (Library), ఫైర్ స్టేషన్ (Fire Station) ఏర్పాటు చేయాలని కోరుతూ బొప్పు సతీష్ సోమవారం గాంధీ విగ్రహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. మండలంలోని ప్రజలకు ఫైర్ స్టేషన్, లైబ్రరీ అత్యంత అవసరమని ఆయన కరపత్రాలు ప్రదర్శిస్తూ నిరసన (Protest) వ్యక్తం చేశారు.

ముఖ్యంగా నిరుద్యోగ యువతకు లైబ్రరీ సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో ఉద్యోగాల కోసం ప్రిపేర్ కావడానికి పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అదే విధంగా ఫైర్ స్టేషన్ లేకపోవడంతో అగ్నిప్రమాదాలు జరిగి ఎన్నోసార్లు నష్టం జరిగినట్లు వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం (Government) స్పందించి ఫైర్ స్టేషన్, లైబ్రరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు