మరింత సులభంగా సేవలు
చింతపేట గ్రామంలో స్మార్ట్ కార్డుల పంపిణీ
ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలం(Mulakalapalli Mandal) జగన్నాధపురం గ్రామపంచాయతీ పరిధిలోని చింతపేట గ్రామం(Chintapeta Village)లో సర్పంచ్ కుంజా వినోద్ సోమవారం స్మార్ట్ రేషన్ కార్డుల(Smart Ration Cards)ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుంజా వినోద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, సౌకర్యాలు, ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసే దిశగా చేపడుతున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
స్మార్ట్ కార్డుల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు అవసరమైన సేవలు మరింత సులభంగా అందేలా ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా ప్రజల్లో అవగాహన కల్పించడం, గ్రామస్థాయిలో ప్రజలకు అవసరమైన సహకారం అందించడం తమ బాధ్యతని తెలిపారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy) సారధ్యంలో అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ(MLA Jare Adinarayana) నాయకత్వంలో ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువయ్యేలా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బైటి వెంకటలక్ష్మి,కాంగ్రెస్ నాయకులు కూరం రామకృష్ణ, పెనుబల్లి వెంకటేష్,రేషన్ డీలర్ సీత లబ్దిదారులు ఉన్నారు.