చదువుకు అడ్డుగా ఆర్థిక ఇబ్బందులు
నిరుపేద విద్యార్థికి ఆర్థిక సహాయం అందించిన మాజీ ఎంపీపీ
బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన నిరుపేద విద్యార్థి తిరుణాల సాయిచరణ్, నీట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభకనపరిచి చదువులకు దూరం కావడంతో ఆయన ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న మాజీ ఎంపీ బూతుల శ్రీనివాస్(Former MPP Boothula Srinivas) ఆయన ఇంటికి వెళ్లి సోమవారం పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ఇచ్చిన డబ్బులు బెడ్ రూమ్ లో జీవనం సాగిస్తున్న ఈయన పై చదువులకు వెళ్లేందుకు తన వంతు సహకారం అందిస్తారని పేర్కొన్నారు.
ఆసిఫాబాద్ లోని ప్రభుత్వ మెడికల్ కళాశాల(Government Medical College)లో ఎంబిబిఎస్ సీట్ దక్కించుకున్న విద్యార్థి ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం అవుతున్నాడని అందుకు మరి కొంతమంది దాతలు చేయూత ఇవ్వాలని ఆయన కోరారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు రాక ఇబ్బందులు పడుతున్నారని ఆయన వాపోయారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు బండారి శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, విడిసి అధ్యక్షులు అల్లకొండ పోతన్న, రైతు నాయకులు బొడ్డు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు అల్లకొండ ప్రశాంత్ నాయకులు మల్లెపూల విజయ్ కుమార్, రాకేష్ రెడ్డి ,రోహిత్ తదితరులు పాల్గొన్నారు