ఓటీటీలోకి ‘మండాడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

05-10-2026 | 03:01pm

సుహాస్ విలనిజం చూడలేదా? నెల కూడా కాలేదు.. అప్పుడే ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్!

థియేటర్లలో మంచి రెస్పాన్స్‌తో దూసుకెళ్లిన ‘మండాడి’ (Mandaadi) ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు Mandaadi OTT Release కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైన Mandaadi Movie.. నెల రోజులు పూర్తికాకముందే ఓటీటీ బాట పట్టింది. తాజాగా ఈ సినిమా Netflix OTTలో అక్టోబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈసారి స్పెషల్ ట్రీట్ ఉండనుంది. Mandaadi Telugu OTT వెర్షన్‌తో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

రూ.140 కోట్లకు పైగా.. ఇప్పుడు ఇంట్లోనే!

సముద్ర తీర ప్రాంతం, సంప్రదాయ పడవల పోటీ నేపథ్యంలో తెరకెక్కిన Mandaadi Movieలో యాక్షన్, స్పోర్ట్స్, ఎమోషన్ కలగలిసిన కథను చూపించారు. సూరి తన పాత్రలో ఆకట్టుకోగా.. తెలుగు నటుడు Suhas Villain Roleలో కనిపించడం సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. థియేటర్లలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు నమోదయ్యాయి. తాజా నివేదికల ప్రకారం ఈ చిత్రం రూ.140 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం.

ఓటీటీలో ఎక్కడ చూడాలి?

ఇక Mandaadi OTT Platform విషయానికి వస్తే.. ఈ సినిమా Netflixలో స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 8 నుంచి తెలుగు సహా ఐదు భాషల్లో అందుబాటులోకి రానుండటంతో థియేటర్లలో మిస్ అయినవారికి ఇది మంచి అవకాశం. ముఖ్యంగా Suhas Mandaadi, సూరి యాక్షన్, పడవల పోటీ సన్నివేశాలను ఇంట్లోనే ఓటీటీలో చూడాలనుకునే ప్రేక్షకుల కోసం ఈ Mandaadi Netflix Releaseపై ఆసక్తి పెరుగుతోంది.




మరిన్ని వార్తలు