సమయపాలన ఏదీ?

05-10-2026 | 03:11pm

10:30 గంటలకు తెరుచుకోని పశు వైద్యశాల

సమయపాలన పాటించని అధికారులు

తాడ్వాయి,(విజయక్రాంతి): ప్రభుత్వ కార్యాలయాల్లో, ఆసుపత్రుల్లో పనిచేసే అధికారులు సమయపాలన పాటించకపోవడంతో ప్రజలు  ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా విధులకు ఆలస్యంగా హాజరవుతున్నారని ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా(Kamareddy district) తాడ్వాయి మండల కేంద్రంలోని పశువైద్యశాల(Veterinary hospital) ఉదయం 10:30 గంటల వరకు తెరుచుకోలేదు. దీంతో రైతులు(Farmers) తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోమవారం ఉదయం తమ పశువులను తీసుకొని మండల కేంద్రంలోని పశువైద్యశాలకు రైతులు వచ్చారు.

కానీ అక్కడ విధులు నిర్వహిస్తున్న పశు వైద్యాధికారులు(Veterinary doctor)  లేకపోవడంతో తమ పశువులను అక్కడే ఉంచుకొని వేచి ఉన్నారు. అక్కడ చికిత్సలు నిర్వహించే సదరు పశువైద్యాధికారి కానీ, వైద్య సహాయకుడు కానీ  లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పశువైద్యాధికారి 10.30 గంటలకు రావడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. తమ పశువులకు చికిత్సలు నిర్వహించుకున్నారు. పశు వైద్యశాల అంటే అత్యవసర కేంద్రం.

ఇలాంటి కేంద్రాల్లో సైతం అధికారులు సమయపాలన పాటించకుంటే ఎలా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 9 గంటలకే తెరుచుకోవలసిన  పశువైద్యశాల తెరుచుకోక పోవడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. పశు వైద్యాధికారి ఆలస్యంగా రావడంతో ఇబ్బందులు పడ్డామని రైతు వేణు కుమార్ తెలిపారు. అధికారి వచ్చేవరకు 8 మంది రైతులం అక్కడే వేచి ఉన్నామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు