రోడ్డు విస్తరణపై డీఎస్పీ గళం
రోడ్డు విస్తరణ పనుల్లో పారదర్శకత పాటించాలి
నష్టపోయిన బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి
ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి
గణపురం,(విజయక్రాంతి): గణపురం ప్రధాన రహదారి నుండి కోటగుళ్లు వరకు విస్తరించనున్న రోడ్డు వెడల్పు పనులను పారదర్శకంగా చేపట్టాలని ధర్మ సమాజ్ పార్టీ(Dharma Samaj Party) జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి డిమాండ్ చేశారు. సోమవారం గణపురం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించ తలపెట్టిన రోడ్డు వెడల్పు పనుల్లో కొందరు కాంట్రాక్టర్ పై ఒత్తిడి తెచ్చి రోడ్డు వెడల్పులో తక్కువ ఫీట్లు వచ్చేలా చేస్తున్నారని.
అధికారులు ఖరారు చేసిన 48 ఫీట్లు కచ్చితంగా ఇరువైపులా ఉండేలా చూడాలని కండెరవి డిమాండ్ చేశారు. అదేవిధంగా రోడ్డు విస్తరణలో ఇల్లు నష్టపోతున్న బాధితులకు కచ్చితంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) ప్రత్యేక చొరవ తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ఈ సందర్భంగా అన్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.