పాక్ ఏజెంట్‌తో లింకులు.. నేవీ అధికారి అరెస్ట్!

05-10-2026 | 09:04am

కోయంబత్తూరులో విశాఖ నేవీ అధికారి ప్రదీప్‌ ముఖర్జీ అరెస్టు (arrest) అయ్యారు. రెడ్‌ఫీల్డ్స్‌లోని ఐఎన్‌ఎస్‌ అగ్రాని వద్ద అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పాకిస్థానీ గూఢచారికి సున్నితమైన సమాచారం (information) చేరవేశారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

సోషల్‌ మీడియా ద్వారా పాక్‌ ఏజెంట్‌తో పరిచయం ఏర్పడినట్లు దర్యాప్తులో అనుమానిస్తున్నారు. హనీట్రాప్‌ (honeytrap) ద్వారా విశాఖ నేవల్‌ బేస్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని షేర్‌ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు (investigation) కొనసాగుతోంది.








మరిన్ని వార్తలు