పంట చేతికొచ్చినా..కొనుగోలు కేంద్రాలు ఏవీ?

05-10-2026 | 05:25am
  1. నిర్మల్ జిల్లాలో లక్ష ఇరవై వేల ఎకరాల సోయా సాగు 
  2. మార్కెట్లో ధర ఉన్నా.. దిగుబడి అంతంతే 

నిర్మల్ అక్టోబర్ 4 ( విజయ క్రాంతి): ఖరీఫ్ సీజన్లో(Kharif season) రైతులు సాగుచేసిన సోయపంట చేతికొచ్చిన ప్రభుత్వ కొనుగోళ్ల విషయంలో ఇంకా స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో(Kharif season) పండించే పంటల్లో పత్తి తర్వాత సోయపంటని ప్రధానమైనది. జిల్లావ్యాప్తంగా నిర్మల్ ముధోల్ ఖానాపూర్ ప్రాంతంలో 1,20,000 ఎకరాల్లో సోయపంట సాగు చేసినట్టు వ్యవసాయ శాఖ అధికారులు(Agriculture Department officials) చెప్తున్నారు.

జూన్ జూలై మాసంలో పంట వేసుకోగా అది ప్రస్తుతం కోత దశకు వచ్చి పంట రైతు చేతికి రావడంతో దాని అమ్ముకునేందుకు రైతులు పంటను ఆయా ప్రాంతాల్లో ఆరబోసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తున్నారు. నిర్మల్ జిల్లాలో నాఫెడ్ ద్వారా ప్రభుత్వం సోయా కొనుగోలను చేపట్టవలసి ఉన్నప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వానికి ప్రతిపాదనలను అధికారులు పంపినప్పటికీ ఇంకా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పై ప్రభుత్వ స్పష్టత రావాల్సి ఉంది. 

దిగుబడులు అంతంత మాత్రమే 

నిర్మల్ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన కోయపంట చేతికి వచ్చినప్పటికీ దిగుబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. జూన్ జూలై మాసంలో విత్తనాలు వేయగా ప్రారంభంలో వర్షాలు కురిసినప్పటికీ జులై ఆగస్టు మాసంలో వర్షాలు లేకపోవడంతో సోయపంట ఆశించిన స్థాయిలో ఎదగలేదు. ముఖ్యంగా పూతాకాత దశలో వర్షం కురువకపోవడం తో పూత కథ తక్కువగా వచ్చి అది దిగుబడులపై ప్రభావం చూపిందని రైతులు చెప్తున్నారు.

సాధారణంగా స్వయపంట ఎకరానికి బాగా పండితే 8 నుంచి  10 క్వింటాళ్ల వరకు ప్రస్తుతం నాలుగైదు గంటలకు మించి రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. సోయపంట విత్తన బ్యాగు 4000 ఉండగా ఎరువులు మందుల రసాయన తలుపులు పెట్టుబడి ఈసారి పెరిగినప్పటికీ దిగుబడి రాకపోవడంతో రైతులు పెట్టిన పెట్టుబడి వస్తే చాలు అనుకునే దశలో చాలామంది ఉన్నారు.

అయితే ప్రస్తుతం సోయ పంటకు ప్రభుత్వ మద్దతు ధర రూ 6 వేలకు పైగా ప్రకటించగా ప్రస్తుతం ప్రైవేట్ లో వ్యాపారులు కూడా దానికి మించి కొనుగోలు చేస్తున్నారని తమకు కొంత ఊరట కలిగించే అంశామని రైతులు చెప్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తేనే రైతులకు మద్దతు ధర ప్రైవేట్ లో కూడా లభించే అవకాశం ఉండడంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా రైతులు కోరుతున్నారు. 

వెంటనే ప్రారంభించాలి 

నిర్మల్ జిల్లాలో ఇప్పటికి ముధోల్ నిర్మల్ డివిజన్లో 50% సోయపంట కోత కోసి పంటను అమ్ముకోవడానికి ఆరబెడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని ఆశతో ఆయా గ్రామాల్లో రైతులు ఖాళీ ప్రదేశాల్లో కుప్పలుగా పోసి పంటను వచ్చేవరకు ఆరబెడుతున్నారు.

ప్రైవేట్ విక్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రైవేట్ లో విక్రయిస్తే మద్దతు ధర తక్కువ వచ్చే అవకాశం ఉండటమే కాకుండా సంచికి కట్టింగ్ పేరుతో మోసం జరిగి నష్టం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. సోయపంట ధర ప్రైవేటు వ్యాపారులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ప్రారంభించని పక్షంలో సిండికేట్ గా ఏర్పడి రోజురోజుకు తగ్గించి కొని అవకాశం ఉందని చెప్తున్నారు.

గత ఏడాది కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడంతో అప్పటికే చాలా మంది రైతులు ఉన్న పంటను తక్కువ ధరకు ప్రైవేటు విక్రయించుకోగా ఆ తర్వాత ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడంతో అమ్ముకున్న రైతుల పేరుని వ్యాపారులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి లాభాన్ని అర్ధించగా రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు.

ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని రైతులకు స్పష్టమైన ప్రకటన చేయడం కూడా వీలైనంత త్వరలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తేనే రైతులకు ప్రయోజనం చేకూర్చనుంది. ఆ దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని జిల్లా రైతులు కోరుతున్నారు. ఎమ్మెల్యేలు విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు