పుస్తక ప్రదర్శనను సందర్శించిన ఎం.ఎడ్ అధ్యాపకులు, విద్యార్థులు
06-11-2026 | 06:48pm
మహబూబ్నగర్: పాలమూరు విశ్వవిద్యాలయ(Palamuru University) కేంద్ర గ్రంథాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు రోజుల పుస్తక ప్రదర్శనను ఎం.ఎడ్ అధ్యాపకులు డా. బషీర్ అహ్మద్, డా. జంగం విశ్వనాథ్ విద్యార్థులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సమన్వయకర్త డా. వి. జయ నాయక్ పుస్తకాల ప్రాముఖ్యత, గ్రంథాలయ వినియోగంపై విద్యార్థులకు వివరించారు. పుస్తక ప్రదర్శనలు విద్యార్థుల్లో జ్ఞానాన్ని, పరిశోధనా దృక్పథాన్ని పెంపొందిస్తాయని అధ్యాపకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎం.ఎడ్ విద్యార్థులు పాల్గొన్నారు.