ఘనంగా కలెక్టర్ రాహుల్ శర్మ జన్మదిన వేడుకలు

06-11-2026 | 07:44pm

భూపాలపల్లి, నవంబర్ 6 (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ రాహుల్ శ(Collector Rahul Sharma) జన్మదినం సందర్భంగా శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కాటారం సబ్‌ కలెక్టర్ సౌరవ్ శర్మ, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డీఆర్వో వసంతకుమారి, ఆర్డీఓ హరికృష్ణతో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా సంక్షేమం, అభివృద్ధి కోసం అధికారులు, సిబ్బంది సమన్వయంతో అంకితభావంతో పనిచేసి జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుదామని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు