పిహెచ్సిని తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

06-11-2026 | 07:33pm

హనుమకొండ, నవంబర్ 06 (విజయక్రాంతి): కొండపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య(District Medical and Health Officer Appaiah) ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వివిధ రిజిస్టర్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫార్మసీ స్టోర్‌ను సందర్శించి మందుల నిల్వలు, మందుల పంపిణీ రికార్డులు, వాటి నిర్వహణ తీరును తనిఖీ చేశారు. అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.

అనంతరం కేంద్రంలో అమలవుతున్న అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ముఖ్యంగా మాతా శిశు ఆరోగ్య సేవలు,సాధారణ టీకాల కార్యక్రమం, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, జాతీయ అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం, టీబీ ముక్త్ భారత్, హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ కార్యక్రమాలు, జాతీయ వెక్టర్ ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణ కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధించాలని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ప్రతి జాతీయ ఆరోగ్య కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని వైద్యాధికారి, సిబ్బందికి ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలని సూచించారు.

మరిన్ని వార్తలు