కరువు మండలంగా భూత్పూర్ ను ప్రకటించాలి
మాజీ చైర్మన్ బస్వా రాజ్ గౌడ్
భూత్పూర్: కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మున్సిపల్ చైర్మన్ బస్వారాజ్ గౌడ్ విమర్శించారు. గురువారం భూత్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో భూత్పూర్ మండలం పేరు లేకపోవడం విడ్డూరమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరువు ఛాయలు నెలకొన్న నేపథ్యంలో భూత్పూర్ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులకు పంట నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
భూత్పూర్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించే వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటామన్నారు. శుక్రవారం జరిగే ధర్నా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు నారాయణ గౌడ్, మురళీధర్ గౌడ్, చంద్రశేఖర్ గౌడ్, సత్యనారాయణ, తూము శ్రీనివాస్ రెడ్డి, అశోక్ గౌడ్, కౌన్సిలర్ గడ్డం ప్రేమ్ కుమార్, టౌన్ అధ్యక్షుడు సురేష్ గౌడ్, నాయకులు రాము రాథోడ్, ఖదీర్, అహ్మద్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.