దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ

04-11-2026 | 08:11pm

దేవరకద్ర నవంబర్ 4 విజయ క్రాంతి: మహబూబ్‌నగర్ జిల్లా, దేవరకద్ర మండలంలోని గోప్లాపూర్ గ్రామంలో పశువైద్య శాఖ(Department of Veterinary Services) ఆధ్వర్యంలో దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ బుధవారం నాడు  కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గోప్లాపూర్‌తో పాటు గుడిబండ, కోయిల్‌సాగర్ గ్రామాల్లో కూడా దూడలకు నట్టల నివారణ మందులు అందజేశారు.

దూడల్లో నట్టల నివారణ చేయడం వల్ల వాటి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. నట్టల వల్ల కలిగే పోషకాహార లోపం, రక్తహీనత, బరువు తగ్గడం, జీర్ణ సంబంధిత సమస్యలను నివారించవచ్చు. పశువుల రోగనిరోధక శక్తి పెంపొందించడంలో కూడా నట్టల నివారణ కీలక పాత్ర పోషిస్తుంది.

కావున పశుపోషకులు తమ దూడలకు పశువైద్యుల డాక్టరు తెలిపారు సూచనల ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు రైతులు పాల్గొన్నారు గ్రామాల రైతులు పాల్గొన్నారు మేరకు క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు వేయించి, పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పశువైద్య శాఖ సూచించింది. పశువుల ఆరోగ్యమే పశుసంపద అభివృద్ధికి పునాది. అని గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు