బ్యాంకర్లకు 5 డేస్ వీక్.. కేంద్రానికి కవిత డిమాండ్

06-10-2026 | 11:27am

హైదరాబాద్: బ్యాంకు ఉద్యోగుల(Bank Employees) ఐదు రోజుల పని విధానం డిమాండ్‌కు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(TRS President Kalvakuntla Kavitha) మద్దతు తెలిపారు. బ్యాంకుల్లో ఉద్యోగులపై పెరుగుతున్న పని ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని(central government) కోరారు. బ్యాంకులు ఉదయం ప్రారంభమైనప్పటి నుంచి కస్టమర్ల సేవలతో పాటు బ్యాక్‌ఎండ్ పనులు, లక్ష్యాల సాధన, నగదు లెక్కింపు వంటి అనేక బాధ్యతలను ఉద్యోగులు నిర్వహిస్తున్నారని కవిత పేర్కొన్నారు. పని వేళలు ముగిసిన తర్వాత కూడా పలువురు ఉద్యోగులు రాత్రి వరకు విధుల్లో కొనసాగాల్సి వస్తోందని ఆమె అన్నారు.

మరోవైపు గత కొన్నేళ్లలో డిజిటల్ బ్యాంకింగ్(Digital Banking), యూపీఐ చెల్లింపులు, ఏటీఎం సేవలు భారీగా విస్తరించాయి. దీంతో బ్యాంకు శాఖలకు నేరుగా వచ్చే ఖాతాదారుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, ఉద్యోగులపై పని భారం మాత్రం తగ్గడం లేదని కవిత అభిప్రాయపడ్డారు. బ్యాంకు ఉద్యోగుల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని, వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేసే దిశగా నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు.

మరిన్ని వార్తలు