సింగిల్ విండో చైర్మన్ గా సుధాకర్ రావు బాధ్యతలు
తాడ్వాయి,అక్టోబర్,06( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడువాయి మండల సింగిల్ విండో చైర్మన్(Tadwai Mandal Single Window Chairman) గా సంతాజి గారి సుధాకర్ రావు మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎమ్మెల్యే తనపై నమ్మకంతో చైర్మన్ గా నియమించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తనపై పెట్టిన నమ్మకాన్ని వ lమ్ము చేయకుండా రైతులకు న్యాయం చేస్తానని తెలిపారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తన పదవి బాధ్యతలు నిర్వహిస్తానన్నారు. ఆయనతోపాటు 12 మంది డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు సంజీవులు, నాయకులు మద్ది మహేందర్ రెడ్డి, అంబీర్ శ్యామ్ రావు, వెంకట్ రెడ్డి,మేకల రాజు, షౌకత్ అలీ, రాజలింగం, అఖిల్ రావు, పోచయ్య, జలంధర్ రెడ్డి,క్లస్టర్ అధికారి నగేష్, మార్కెటింగ్ అధికారి నర్సింలు, కార్యదర్శి నరసింహులు,సిబ్బంది నితేష్ రెడ్డి,శ్రీకాంత్, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.