మార్కెట్ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కనకయ్య సమీక్ష

06-10-2026 | 05:42pm

2025-26 ఆదాయ, వ్యయాలపై చర్చ..

కామేపల్లిలో సబ్‌యార్డ్ ఏర్పాటుపై పరిశీలన

ఇల్లెందు టౌన్, అక్టోబర్ 6, (విజయక్రాంతి): ఇల్లెందు మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ బానోత్ రాంబాబు అధ్యక్షతన పాలకవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఆదాయ, వ్యయాలపై పాలకవర్గం సమీక్షించింది.

మార్కెట్ పరిధిలోని టేకులపల్లి సబ్‌యార్డ్, మార్కెట్ కార్యాలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మార్కెట్ పరిధిలోని కామేపల్లి మండలంలో నూతన సబ్‌యార్డ్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చర్చించారు. సమావేశంలో వైస్ చైర్మన్ బిజ్జా వెంకటేశ్వర్లు, సొసైటీ చైర్మన్ మెట్ల రామకృష్ణ, పాలకవర్గ సభ్యులు కుంజా వసంతరావు, జారే సమ్మక్క, బొల్లి రాజు, గుగులోత్ గబ్రూ, మాలోత్ బావుసింగ్, భూక్యా శివలాల్ నాయక్, బానోత్ జింకు, ఊకే బుచ్చయ్య, జిగట వెంకన్న, మార్కెట్ జేఎంఎస్ పిక్లా నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు