మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రుణాలు మాఫీ చేయాలి

06-10-2026 | 05:57pm

మాజీ ఎంపీపీ

బోథ్ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులకు ఇచ్చిన రుణాలను మాఫీ చేయాలని మాజీ ఎంపీపీ బండారు ముత్యంరెడ్డి(Former MPP Bandaru Muthyam Reddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల మండలంలో పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నదని అంతేగాక భూగర్భ జలాలు అడగడంతో సాగునీరు కష్టంగా మారిందన్నారు. రైతులు పంట సాగు కోసం లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి నష్టపోయారని వాపోయారు.

ఫసల్ బీమా అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వాపోయారు. ప్రభుత్వం ఎకరానికి 40 వేల రూపాయలు పరిహారంగా అందించాలని కోరారు. రైతు ప్రభుత్వం అంటూనే రైతాంగాన్ని నిలువును అమంచుతున్నారని విమర్శించారు. రైతులను ఆదుకోకపోతే ఉద్యమించాల్సి వస్తుంది అన్నారు.

మరిన్ని వార్తలు