నియోజకవర్గ వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా దారా రమేష్
దమ్మపేట, అక్టోబర్ 06 (విజయక్రాంతి): తెలంగాణ వార్డు మెంబర్ల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి మహేష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గ వార్డు మెంబర్ల ఫోరం అధ్యక్షుడిగా దమ్మపేట గ్రామ పంచాయతీకి చెందిన 14వ వార్డు సభ్యులు దారా రమేష్(Dara Ramesh)ను నియామకం చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
భద్రాద్రి జిల్లా అధ్యక్షురాలు నక్క లక్ష్మీ ఆదేశాల మేరకు దారా రమేష్‌ను అశ్వారావుపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దారా రమేష్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని వార్డు మెంబర్ల సంక్షేమం కోసం కృషి చేస్తానని, వార్డు మెంబర్లు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంతో పాటు జిల్లా మరియు రాష్ట్ర స్థాయి ఫోరం నాయకుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
నా మీద నమ్మకంతో నన్ను అశ్వారావుపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించేందుకు సహకరించిన తెలంగాణ వార్డు మెంబర్ల ఫోరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు నక్క లక్ష్మీ, వ్యవస్థాపక అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి మహేష్, ప్రతీ ఒక్క వార్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దమ్మపేట మండల ప్రజలు దారా రమేష్ కి అభినందనలు తెలియజేశారు.