ఏసీబీకి పట్టుబడ్డ మున్సిపల్ ఉద్యోగులు

28-11-2026 | 05:20am

సదాశివపేట మున్సిపల్ ఏఈ, వర్క్ ఇన్‌స్పెక్టర్ అరెస్టు

సదాశివపేట, నవంబర్ 27: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ(Sadasivpet Municipality)లో లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులు శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డారు. సదాశివపేట మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఏ రాజేష్ కుమార్, అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఏ శివారెడ్డి రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 2025లో సంగారెడ్డి పట్టణంలోని ఊబ చెరువులో నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాల ఐరన్ స్క్రాప్ పూడిక తీసేందుకు ఓ కాంట్రాకర్ట్ అక్టోబర్ నెలలో రూ.5.4 లక్షల టెండర్‌ను దక్కించుకున్నాడు.

అనంతరం పూడిక పనులు పూర్తి చేశాక టెండర్ బిల్లు చెల్లించాలని  ఏఈ ఆకుల రాజేష్‌ను ఆశ్రయించగా బిల్లు చెల్లింపులకు రూ.15 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఈ నెల 21న  ఏసీబీనీ ఆశ్రయించగా ఏసీబీ అధికారులు  వల పన్ని  శుక్రవారం 15 వేల నగదును తీసుకున్న ఏఈ  రాజేష్, వర్క్ ఇన్స్‌పెక్టర్ శివారెడ్డిలను   అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల విచారణ కోసం రెండో అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. 

మరిన్ని వార్తలు