స్టార్ స్పిన్నర్‌పై వేటు
577 వికెట్లు తీసినా తప్పని ఉద్వాసన.. స్టార్ స్పిన్నర్‌కు ఆసీస్ షాక్!
ఆస్ట్రేలియా క్రికెట్‌లో(Australia Test Squad) కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్ కోసం ప్రకటించిన 13 మంది సభ్యుల జట్టులో వెటరన్ స్పిన్నర్ నాథన్ లయన్‌కు(Nathan Lyon Dropped) సెలక్టర్లు చోటివ్వలేదు. 39 ఏళ్ల ఈ స్టార్ బౌలర్ స్థానంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్లు కోరీ రాకిచియోలీ, జాక్ క్లేటన్‌లకు తొలిసారి అవకాశం కల్పించారు. 145 టెస్టుల్లో 577 వికెట్లు తీసిన అనుభవజ్ఞుడిని పక్కన పెట్టడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా లయన్ ప్రదర్శనను పరిశీలిస్తున్న సెలక్షన్ కమిటీ, తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి మ్యాచుల్లో అతడి Bowling ప్రభావం ఆశించిన స్థాయిలో లేదని సెలక్షన్ ఛైర్మన్ జార్జ్ బెయిలీ పేర్కొన్నారు. అయితే లయన్ అనుభవం, నైపుణ్యాలకు జట్టులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన కోరీ రాకిచియోలీకి ఈసారి అదృష్టం కలిసొచ్చింది. షెఫీల్డ్ షీల్డ్‌లో ఆరు వికెట్లు పడగొట్టడంతో పాటు తొలి First-Class Century సాధించి సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. తొలి టెస్టులోనే అరంగేట్రం చేసే అవకాశం ఉంది. మరో కొత్త ఆటగాడు జాక్ క్లేటన్‌ను బ్యాటింగ్‌లో మూడో స్థానానికి పరిశీలిస్తున్నారు. గాయం నుంచి కోలుకున్న స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ తిరిగి జట్టులోకి రావడం ఆసీస్‌కు బలాన్నివ్వనుంది. పాట్ కమిన్స్ కెప్టెన్సీలో ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ వంటి కీలక ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరగనున్న ఈ సిరీస్‌లో ఆసీస్ కొత్త ఆటగాళ్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఆస్ట్రేలియా జట్టు
పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, జాక్ క్లేటన్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మైఖేల్ నెసెర్, మాథ్యూ రెన్‌షా, కోరీ రాకిచియోలీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్.