హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్లో బ్రహ్మోత్సవ వేడుకలు
డిసెంబర్ 1 నుంచి 6 వరకు ఘనంగా నిర్వహణ
హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): హైదరాబాద్లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్(Hare Krishna Golden Temple) 8వ వార్షిక బ్రహ్మోత్సవాలను డిసెంబర్ 1 నుంచి 6 వరకు జరుపుకునేందుకు సర్వం సిద్ధమైంది. 2018లో ప్రారంభమైన ఈ గోల్డెన్ టెంపుల్లో ప్రాచీన స్వయంభూ శ్రీలక్ష్మీనరసింహ స్వామి, రాధా గోవిందులుప్రధాన దేవతామూర్తులుగా కొలువై ఉన్నారు. వీరితో పాటు పరివార దేవతలైన పాంచజన్యేశ్వర స్వామి (అపూర్వమైన జలగర్భ సాలగ్రామ శిల), జప ఆంజనేయ స్వామి, ఆచార్య పరంపరకు చెందిన ఇతర పూజనీయ దేవతామూర్తులు కూడా దర్శనమిస్తారు. ఈ గోల్డెన్ టెంపుల్ జంటనగరాల నుంచే కాకుండా తెలంగాణలోని అనేక ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులను ఆకర్షిస్తోంది.
కాగా ఉత్సవాలు డిసెంబర్ 1న లక్ష్మీనరసింహ స్వామి మూలమూర్తి, ఉత్సవ మూర్తులకు అభిషేకంతో ప్రారంభమవుతాయి. డిసెంబర్ 4, 6 తేదీల్లో అత్యంత శుభప్రదమైన కార్యక్రమాలుగా పవిత్రభూ సమేత నరసింహ స్వామి కల్యాణోత్సవం, 108 కలశాలతో రాధా గోవింద మహా చూర్ణాభిషేకం జరుగుతాయి. కాగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరే కృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ అధ్యక్షులు, త్రిదండి సన్యాసి పూజ్య శ్రీమాన్ సత్య గౌర చంద్ర స్వామీజీ మహారాజ్ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పోస్టర్ను, కార్యక్రమ వివరాలను ఆవిష్కరించారు. స్వామిజీ మాట్లాడుతూ ఉత్సవాలకు భక్తులకు అధిక సంఖ్యలో హా జరై విజయవంతం చేయాలని కోరు.