రహదారులపై సమగ్ర సర్వే చేపట్టాలి

28-11-2026 | 07:09am

66 అడుగుల రోడ్డు వెడల్పును రికార్డులతో నిర్ధారించాలి

ఆక్రమణలు తొలగించి అందరిపై సమానంగా చర్యలు తీసుకోవాలి

బెజ్జంకి: బెజ్జంకి మండల కేంద్రంలోనీ సిద్దిపేట, కరీంనగర్, బేగంపేట ప్రధాన రహదారుల వెడల్పుపై సంబంధిత అధికారులు సమగ్ర సర్వే(Bezjanki Road Width Survey) చేపట్టి, అధికారిక రికార్డుల ప్రకారం హద్దులను నిర్ధారించాలని ఐలేని రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఐలేని మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ రహదారులు 66 అడుగుల వెడల్పు ఉండాలన్న సమాచారాన్ని రికార్డులతో పరిశీలించి, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న వెడల్పును ప్రజలకు వెల్లడించాలని కోరారు.

రహదారుల ఇరువైపులా నిర్మించిన మెట్లు, ర్యాంపులు, షెడ్లు తదితర నిర్మాణాలు రోడ్డు స్థలంలోకి వచ్చాయో లేదో సర్వే ద్వారా తేల్చాలన్నారు. ఆక్రమణలు నిర్ధారణ అయితే ఎలాంటి పక్షపాతం లేకుండా అందరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, పెరుగుతున్న వాహనాల రద్దీ, పాదచారుల భద్రత, అత్యవసర వాహనాల రాకపోకలకు రహదారులు విశాలంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు