ఆధ్యాత్మిక సేవలో సీఎల్ రాజం దంపతులు
కొండగట్టు, భీమేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు
వేములవాడ/కొడిమ్యాల, నవంబర్ 27 (విజయక్రాంతి): విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం(Vijayakranthi Chairman CL Rajam), యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు మెంబర్, విజయక్రాంతి దినపత్రిక ఎండీ విజయ రాజం దంపతులు శుక్రవారం ఆలయాల సందర్శన చేపట్టారు. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న నిజరూప దర్శనాన్ని పురస్కరిం చుకొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు వారికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఆశీర్వచనం అందజేసి, ఆలయ ఏఈఓ హరినాథ్ చైర్మన్ దంపతులను సత్కరించారు.
వారిని విజయక్రాంతి కరీంనగర్ ప్రతినిధి విజయసింహారావు, యాడ్స్ మేనేజర్ ఆంజనేయులు, కొడిమ్యాల రిపోర్టర్ కొండూరి సురేష్, కరీంనగర్ రిపోర్టర్ రామకృష్ణ, మల్యాల రిపోర్టర్ రమేష్ శాలువాతో సన్మానించారు. అలాగే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామిని సీఎల్ రాజం, విజయ రాజం దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వేదోక్త ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు. వీరి వెంట ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస శర్మ పీఆర్వో పెరుక శ్రీనివాస్ ఉన్నారు.