నన్ను బాంబుతో పేల్చేస్తారా?

28-11-2026 | 07:40am

బాంబు బెదిరింపులకు భయపడను.. ముంబై వేదికగా దిల్జిత్ స్ట్రాంగ్ కౌంటర్!

ప్రముఖ సింగర్, నటుడు దిల్జిత్ దోసాంజ్ ముంబైలో జరిగిన తన Live Concertలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. షోకు ముందు బాంబు బెదిరింపులు రావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నప్పటికీ, అభిమానులు భారీ సంఖ్యలో హాజరుకావడంపై ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. వారి ధైర్యమే తనకు స్టేజ్‌పై Performance ఇచ్చే స్ఫూర్తిని అందించిందని పేర్కొన్నాడు. దక్షిణ ముంబైలోని మహాలక్ష్మి రేస్‌కోర్స్‌లో నవంబర్ 27న జరిగిన ఈ Concertకు ముందు నవంబర్ 26న బెదిరింపు ఈమెయిల్ రావడం కలకలం రేపింది. ఈవెంట్ జరిగే ప్రదేశంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో Bomb Blast జరిగే అవకాశం ఉందంటూ ఆ మెయిల్‌లో హెచ్చరికలు ఉన్నట్లు సమాచారం. దీంతో భద్రతా ఏర్పాట్లపై ఆందోళన నెలకొంది. అయినప్పటికీ అభిమానులు వెనక్కి తగ్గకుండా షోకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా దిల్జిత్ మాట్లాడుతూ.. 2024లో కూడా తన Concertల సమయంలో పలు ఆంక్షలు, ఇబ్బందులు ఎదుర్కొన్నానని గుర్తుచేసుకున్నాడు. కొన్ని పాటలు పాడొద్దని సూచించేవారని, అయితే అవన్నీ చిన్న సమస్యలేనని చెప్పాడు. 2026లో మాత్రం ఒక షో నిర్వహించడమే పెద్ద సవాలుగా మారిందని తన ఆవేదన వ్యక్తం చేశాడు. అభిమానుల ధైర్యం తనకు ఎంతో బలాన్నిచ్చిందని తెలిపాడు. బాంబు బెదిరింపుల నేపథ్యంలోనూ తనదైన శైలిలో స్పందిస్తూ దిల్జిత్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తనకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు ఆయన ప్రత్యేకంగా Thanks చెప్పాడు. ఈ ఘటనతో ముంబై Concert ఇప్పుడు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.



మరిన్ని వార్తలు