రేడియల్ రోడ్- టెండర్లలో అక్రమాలు

11-10-2026 | 05:25am
  1. రూ.600 కోట్లు అధికంగా కోట్ చేసిన సంస్థలకు పనులా?
  2. తక్కువ ధరకు బిడ్లు వేసిన సంస్థలకు నిరాశ
  3. హడువుడి నిర్ణయాలతో ప్రజాధనం వృథా 
  4. టెండర్లను రద్దు చేసి విచారణ జరపాలని డిమాండ్
  5. ముఖ్యమంత్రికి కేటీఆర్ లేఖ 

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : రూ.3,296 కోట్ల అంచనా వ్యయం తో చేపట్టిన రేడియల్ రోడ్- టెండర్ల వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్(BRS Working President KTR ) చేశారు. బుద్వేల్ కొడంగల్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి చేపట్టిన టెండర్లలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు.

పనులను ప్యాకేజీలుగా విభజిం చి, ముందుగా నిర్ణయించుకున్న సంస్థలకే కట్టబెట్టారనే అనుమానాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. తక్కువ ధర కు బిడ్లు వేసిన సంస్థలను పక్కనపెట్టి, ఎక్కు వ ధరలకు కోట్ చేసిన సంస్థలకు పనులు కేటాయించడంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రే వంత్‌రెడ్డికి శనివారం కేటీఆర్ లేఖ రాశారు.

బుద్వేల్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొడంగల్ సమీపంలోని ఎన్‌హెచ్ వరకు 81.15 కిలోమీటర్ల గ్రీన్‌పీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి మూడు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారని మంత్రి తెలిపారు. అయి తే 2026 సెప్టెంబర్ 30తో బిడ్ల దాఖలు గడువు ముగియగా, అక్టోబర్ 8 నాటికే సాం కేతిక మూల్యాంకనం, బిడ్డర్ల అర్హతల పరిశీలన, ఆర్థిక బిడ్ల పరిశీలన, కేటాయింపుల ప్రక్రియ పూర్తయినట్లు సంబంధిత పత్రాల్లో పేర్కొన్నారని వివరించారు.

సెలవులను మి నహాయిస్తే కేవలం ఐదు రోజుల్లోనే రూ. 3,296 కోట్ల ప్రాజెక్టుకు సంబంధించిన 13 బిడ్ల పరిశీలన, అర్హతల నిర్ధారణ, కేటాయింపుల ప్రక్రియ ఎలా పూర్తి చేశారని ప్రశ్నిం చారు.  ప్యాకేజీ- ఎన్సీసీ లిమిటెడ్‌కు రూ.1,286.03 కోట్లకు కేటాయించారని, ఇది అంచనా వ్యయం కంటే 3.95 శాతం అధికమని సంబంధిత పత్రాల్లో పేర్కొన్నారని కేటీఆర్ తెలిపారు. ప్యాకేజీ- బీవీఎస్ ఆర్కు, ప్యాకేజీ-3 జీకేసీకి దక్కినట్లు కేటీఆర్ తెలిపారు.

అయితే మిగిలిన ప్యాకేజీలకు సం బంధించిన పూర్తి ఆర్థిక వివరాలు ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. ప్రతి ప్యాకేజీకి ఎన్ని సంస్థలు బిడ్లు వేశాయి? ఎన్ని అర్హత సాధించాయి? ఏ సంస్థ ఎంత ధర కోట్ చేసింది? అంచనా వ్యయంతో పోలిస్తే తుది కేటాయింపు ఎంత ఎక్కువగా ఉంది? అనే వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

ఒకే సంస్థకు ఒక ప్యాకేజీలో అర్హత.. మరో ప్యాకేజీలో అనర్హత ఎలా?

మూడు ప్యాకేజీల్లో బిడ్డర్ల అర్హతల నిర్ధారణకు ఒకే విధమైన ప్రమాణాలు అనుసరిం చారా? అని  కేటీఆర్ ప్రశ్నించారు. ప్యాకేజీ జీకేసీని అనర్హంగా ప్రకటించగా, ప్యాకే జీ- అర్హత కల్పించారని తెలిపారు.  బీవీఎస్‌ఆర్కు ప్యాకేజీ-1, ప్యాకేజీ-2ల్లో అర్హత క ల్పించి, ప్యాకేజీ-3లో తిరస్కరించారని పేర్కొన్నారు. ఒకే సంస్థకు వేర్వేరు ప్యాకేజీల్లో భిన్న మైన నిర్ణయాలు తీసుకోవడానికి కారణాలు ఏమిటో ప్రభుత్వం వివరించాలని కోరారు.

ప్యాకేజీ-3లో సుమారు రూ.1,034 కోట్ల విలువైన పనులకు కేవలం ఇద్దరు బిడ్డర్లు మాత్రమే అర్హత సాధించినట్లు పత్రాల్లో పేర్కొన్నారని కేటీఆర్ తెలిపారు. అతి తక్కువ ధరకు బిడ్లు వేసినట్లు చెబుతున్న శుచీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్‌ను మూడు ప్యాకేజీల్లోనూ అనర్హులుగా ప్రకటించిన అంశంపై ఆ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు.

ఈ సంస్థను అనర్హంగా ప్రకటిం చడం వల్ల మూడు ప్యాకేజీల్లో కలిపి రాష్ట్రానికి సుమారు రూ.600 కోట్ల నష్టం వాటిల్లుతుందని ఆ సంస్థ తరఫున కోర్టులో సమర్పించిన వాదనల్లో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ ఆరోపణలపై పూర్తి స్థాయి విచా రణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని కోరారు.  హెచ్‌ఎండీఏ, హెచ్జీసీఎల్ చేపడుతున్న భారీ టెండర్లలో తమను దూరంగా ఉంచుతున్నారని,

బిడ్డర్లు తమకు అనుకూలంగా వ్యవహరించకపోతే సాంకేతిక కారణా లతో అనర్హత వేటు వేస్తున్నారని కొందరు తెలంగాణ కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారని కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు. ఈ ఆరోపణలపై  విచారణ జరిపి వాస్తవాలను వెల్ల డించాలని కోరారు. 

రేడియల్ రోడ్-1 టెండర్లపైనా పారదర్శకతకు సంబంధించి ప్రశ్నలు తలెత్తుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.591 కోట్లుగా పేర్కొంటూ, అంచనా వ్యయం కంటే సుమారు 15 శాతం అధిక ధరకు కేటాయింపు జరిగిందని సంబంధిత పత్రాల్లో ప్రస్తావించినట్లు తెలిపారు. రెండు రేడియల్ రోడ్ల అంచనా వ్యయాలు, బిడ్ల ధరలు, సంస్థల అర్హతలు, తుది కేటాయింపుల వివరాలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలని డిమాండ చేశారు.


మరిన్ని వార్తలు