ఔషధాల దుర్వినియోగాన్ని నివారించేందుకు చర్యలు అవసరం

11-10-2026 | 05:30am

ఎన్‌సీబీ హైదరాబాద్ జోనల్ డైరెక్టర్ డాక్టర్ పి.ఎం.యశ్వంత్

అక్టోబర్ 10 (విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతున్న రో గులకు అవసరమైన ఔషధాలను సకాలం లో అందుబాటులో ఉంచాలి.దాంతో పాటు వాటి దుర్వినియోగాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎన్సీబీ హైదరాబాద్ జోనల్ డైరెక్టర్ డాక్టర్ పి.ఎం.య శ్వంత్ (NCB Hyderabad Zonal Director Dr. P.M. Yashwanth)అన్నారు.

బసవతారకం ఇండో-అమె రికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నొప్పి నివారణ - ఉపశమన వై ద్య విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ హాస్పిస్, ఉపశమన వైద్య సంరక్షణ దినోత్సవం  2026ను శనివారం నిర్వహించారు. భారతదేశంలో నియంత్రిత ఔషధాల వైద్యపరమైన వినియోగం అందుబాటు, నియంత్రణ, రోగి సంరక్షణ మధ్య సమతుల్యత అనే అంశంపై నిపుణుల ప్యానెల్ చర్చ జరిపారు.

ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ మాట్లాడుతూ రోగులకు అవసరమైన మందులు సకాలంలో అందుబాటు లో ఉంచుతూనే, వాటి దుర్వినియోగాన్ని అరికట్టేలా సమర్థవంతమైన నియంత్రణ చర్యలు ఉండాలని ఆయన సూచించారు. అనంతరం చర్చా కార్యక్రమంలో ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు, ఫార్మసీ విభాగ ప్రతినిధులు, ఎన్సీబీ అధికారులు పాల్గొని నైతిక వైద్య విధానాలు, నిబంధనల పాటింపుపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

చర్చలో బసవతారకం అంకో అనస్థీ షియా విభాగాధిపతి డాక్టర్ బసంత్ కుమా ర్ రాయని, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వి భావరి నాయక్, నొప్పి నివారణ, ఉపశమన వైద్యవిభాగం ఇంచార్జి డాక్టర్ ప్రణీత్ సువ్వా రి, ఫార్మసీ జనరల్ మేనేజర్లు డాక్టర్ దీపికా రెడ్డి చెరుకూరి, సిహెచ్ నరేంద్ర, ఎన్సీబీ అసిస్టెంట్ డైరెక్టర్ విశాల్ విలాస్ రాజోలే, సూ పరింటిండెంట్ ఆశిష్ చక్రవర్తి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు