హైటెక్స్ ఎగ్జిబిషన్‌లో 14,15 తేదీల్లో సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్

11-10-2026 | 05:30am
  1. ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
  2. హాజరుకానున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్, సినీ నటుడు, పద్మ విభూషణ్ చిరంజీవి 
  3. ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

అక్టోబర్ 10 (విజయక్రాంతి): వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రం గాల అభివృద్ధితో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు(Entrepreneurs) అంతర్జాతీయ స్థాయిలో కొత్త అవకాశాలను కల్పించే లక్ష్యంతో సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ‘సమా ఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్2026’  అక్టోబర్14,15 తేదీల్లో హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో(Hitex Exhibition Center) రెండు రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించనున్నట్లు  సమాఖ్య ఛాం బర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు టీవీఎన్ రావు, పీవీ రావు, ఏవీ రత్నం, తోట చంద్రశేఖర్, రజనీకాంత్ వెల్లడించారు.

ఈ మేరకు శనివారం లక్డీకాపూల్ లోని ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈనెల 14న ఉదయం 10.30 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామ ర్సును ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు పద్మ విభూషణ్, ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ సైతం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు.

ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, స్టార్టప్లు, మహిళా పారి శ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఈ సదస్సు ప్రాధాన్యమివ్వనుందని వెల్లడించారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తమ ఆలోచనలు, ఉత్పత్తులు, సేవలను విస్తృత స్థాయిలో పరిచయం చేసుకునేందుకు ఈ వేదిక దోహదపడనుందని, దక్షిణ భారతదేశంలో వ్యాపార, పారిశ్రామిక అభివృద్ధికి ఈ సమావేశం కొత్త అవకాశాలను అందిస్తుంద ని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు