60 ఏళ్ల ప్రజల ఆకాంక్షకు రూపం
- మెదక్ జిల్లా ఆవిర్భావానికి పదేళ్లు
- కలను నిజం చేసిన కేసీఆర్
- కేసీఆర్ కృషిని గుర్తుచేస్తూ బీఆర్‌ఎస్ కాగడాల ర్యాలీ
మెదక్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): మెదక్ ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్షను మాజీ సీఎం కేసీఆర్ సాకారం చేశారని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి(Medak District President Padma Devender Reddy) అన్నారు. మెదక్ జిల్లా ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం పట్టణంలో బీఆర్‌ఎస్ నాయకులు కాగడాల ర్యాలీ నిర్వహించారు. క్రిస్టల్ గార్డెన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ డిపో వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మెదక్ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రత్యేక జిల్లా కలను కేసీఆర్ నిజం చేశారని పేర్కొన్నారు. ప్రత్యేక జిల్లా ఏర్పాటుతో పరిపాలన ప్రజలకు చేరువైందని, ప్రభుత్వ సేవలు స్థానికంగానే అందుబాటులోకి వచ్చాయని వివరించారు. మెదక్ ఎమ్మెల్యేగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలోనే ప్రత్యేక జిల్లా ఏర్పాటు కావడం తన రాజకీయ జీవితంలో మరిచిపోలేని ఘట్టమని అన్నారు.
జిల్లా కోసం ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశారని, వారి ఆకాంక్ష నెరవేరడంతో మెదక్ అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడిందని పేర్కొన్నారు. అనంతరం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి. సుభాష్ రెడ్డిలు మాట్లాడుతూ.. మెదక్ జిల్లాను ఏర్పాటు చేసిన కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో మెదక్ జిల్లా కేంద్రానికి సంబంధించిన ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు సంగారెడ్డిలో ఉండటంతో జిల్లా అధికారులను కలవాలన్నా ప్రజలు అక్కడికి వెళ్లాల్సి వచ్చేదని గుర్తుచేశారు.
కేసీఆర్ నాయకత్వంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పరిపాలనలో సమూల మార్పులు వచ్చాయని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్,
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు బట్టిజగపతి, ఆకిరెడ్డి. కృష్ణారెడ్డి, గంగా నరేందర్, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, మున్సిపల్ కౌన్సిలర్ లు జుబెర్ అహ్మద్, సోహెల్, దీపక్ కుమార్, మాజీ కౌన్సిలర్ లు విజయలక్ష్మి, భీమరి. కిషోర్, మాయ. మల్లేశం,మెదక్, హవెలిఘనపూర్, శంకరంపేట్ ఆర్,మండల పార్టీ అధ్యక్షులు యం. అంజ గౌడ్, సిహెచ్. శ్రీనివాస్ రెడ్డి, పట్లోరి.రాజు, రామాయంపేట పిఎసిఎస్ చైర్మన్ బాదే చంద్రం పాల్గొన్నారు.