నిమ్స్‌లో అత్యాధునిక ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ
సంక్లిష్ట వెన్నెముక సమస్యలకు ఉచితంగా ఆధునిక చికిత్స
అక్టోబర్ 10 (విజయక్రాం తి): నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)(Nizam's Institute of Medical Sciences) ఆసుపత్రి సంక్లిష్టమైన మెడ, ఛాతీ భాగాల వెన్నెముక సమస్యలతో బాధపడుతున్న రోగులకు అత్యాధునిక యూని లేటరల్ బైపోర్టల్ ఎండోస్కోపీ సాంకేతికత ద్వారా విజయవంతంగా ఉచిత శస్త్రచికిత్సలు అందిస్తోంది.
ఈ విషయమై నిమ్స్ ప్రతినిధులు శనివారం మాట్లాడుతూ సర్వైకల్ స్పాండిలోసిస్, ఆసిఫికేషన్ ఆఫ్ పోస్టీరియర్ లాంగిట్యూడినల్ లిగమెంట్, ఆసిఫికేషన్ ఆఫ్ ఎల్లో లిగమెంట్ వంటి తీవ్రమైన వ్యా ధుల వల్ల వెన్నెముక లిగమెంట్లు ఎముకలా గట్టిపడి వెన్నుపాముపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఫ్లోరోసిస్ ప్రభావం వల్ల కూడా తరచుగా కనిపించే ఈ వ్యాధులు నడకను క్రమంగా ప్రభావితం చేస్తాయన్నారు.
సమయానికి చికిత్స అందకపోతే కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, నడిచేటప్పు డు తూలడం, మూత్ర నియంత్రణ కోల్పోవడం, చివరికి తీవ్ర వైకల్యం లేదా పక్షవా తానికి దారితీసే ప్రమాదం ఉందని వివరించారు. సాధారణంగా పెద్ద కోత పెట్టి చేసే ఓపెన్ సర్జరీల స్థానంలో,నిమ్స్ న్యూరోసర్జరీ విభాగం అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ యెర్రమనేని వంశీ కృష్ణ,అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మరియం అఫీఫా నేతృత్వంలోని వైద్య బృందం ఈ మినిమల్లీ ఇన్వేసివ్ విధానాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తోందన్నారు.
డాక్టర్ వసుంధర ఎస్. రంగన్,డాక్టర్ ఆదిత్య మడిశెట్టి,డాక్టర్ అక్షయ్ సింగ్ రాజ్పుత్ లతో కూడిన ఈ వైద్య బృందం సగం సెంటీమీటర్ పరిమాణంలో ఉండే రెండు చిన్న కోతల ద్వారా హై-డెఫినిషన్ కెమెరా,ప్రత్యేక పరికరాలను పంపి ఒత్తిడి కలిగిస్తున్న ఎ ముక లేదా గట్టిపడిన లిగమెంట్ను తొలగిస్తున్నారని చెప్పుకొచ్చారు.
కార్పొరేట్ ఆసుప త్రులలో సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చ య్యే ఈ సంక్లిష్ట శస్త్రచికిత్సలను, ప్రభుత్వ సహాయ సహకారాలతో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిమ్స్లో ఉచితం గా అందిస్తున్నారని వెల్లడించారు. రోగి ఆరో గ్య పరిస్థితి, వ్యాధి తీవ్రతను బట్టి వైద్యులు ఈ శస్త్రచికిత్సను నిర్ణయిస్తుండగా, ఆధునిక వెన్నెముక చికిత్స అందుబాటులోకి రావడం పేద, మధ్యతరగతి వర్గాలకు పెద్ద ఊరటగా నిలిచిందని తెలియజేశారు.