ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి
గుండాల, (విజయక్రాంతి): మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ(Chakali Ailamma) 131 వ జయంతి కార్యక్రమాన్ని రజక సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు గడ్డం లాలయ్య, గడ్డం వీరన్నలు మాట్లాడుతూ.. రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 131 వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఐలమ్మ దొరల గడిలను బద్దలు కొట్టి పీడిత ప్రజల విముక్తి కోసం ఆమె ఎంతో కృషి చేశారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలను దొరలు, పెత్తందారులు చిత్రహింసలకు గురి చేస్తున్న తరుణంలో ఆయుధం చేత బూని వారికి ఎదురు తిరిగి పోరాడిన వీరనారి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు గడ్డం రవి, గడ్డం నారాయణ, గడ్డం మోహన్, గడ్డం నగేష్, గామాలపాటి లక్ష్మీనారాయణ, గామాలపాటి నవీన్, గడ్డం శ్రీను, గడ్డం రాజేష్, గడ్డం రమేష్, సట్టు లాలయ్య, గడ్డం పాపయ్య, గడ్డం శ్రీకాంత్, గడ్డం రామకృష్ణ, గడ్డం సుమంత్, గడ్డం హేమంత్, గామాలపాటి రాహుల్, సంతపురి చైతన్య, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు బొమ్మెర్ల నాగేష్, మండల నాయకులు కొండ్రు నారాయణ తదితరులు పాల్గొన్నారు.