బైక్ మెకానిక్ షాపులో అగ్నిప్రమాదం

09-11-2026 | 09:35pm

రూ.12 లక్షల ఆస్తి నష్టం

కొండపాక , నవంబర్ 9 (విజయక్రాంతి): దీపావళి పండుగ(Festival of Diwali) వేళ ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో(Fire accident) బైక్ మెకానిక్ షాపు(Bike Mechanic Shop) పూర్తిగా దగ్ధమై సుమారు రూ.12 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. కుక్కునూరు పల్లి పోలీసులు(Kukkunuru Palli Police) తెలిపిన వివరాల మేరకు గిరిపల్లి మండలానికి చెందిన భువనగిరి చందు గత ఏడేళ్లుగా కుకునూరుపల్లిలో బైక్ మెకానిక్ షాపు నిర్వహిస్తున్నాడు. దీపావళి సందర్భంగా ఆదివారం సాయంత్రం షాపులో పూజ నిర్వహించి రాత్రి 9 గంటలకు తాళం వేసి వెళ్లిపోయాడు.

సోమవారం తెల్లవారుజామున స్థానికుడు సత్యనారాయణ ఫోన్ చేసి షాపు నుంచి పొగలు వస్తున్నాయని సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న చందు షట్టర్ తెరిచి చూడగా వెనుక భాగంలోని అటక వద్ద మంటలు వ్యాపించి ఉన్నాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

అప్పటికే షాపులోని ఆటోమొబైల్ విడిభాగాలు, మెకానిక్ పనిముట్లు, కంప్రెషర్, వెల్డింగ్, కటింగ్ యంత్రాలు, ఇతర పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.12 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు. దీపావళి పూజలో వెలిగించిన ప్రమిదల వల్ల లేదా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు