సలగుపల్లి లో మురికి కాలువలు కంపు కంపు..!
బెజ్జూర్ అక్టోబర్ 30 (విజయ క్రాంతి): సలుకుపల్లి గ్రామంలో(Salukupalli Village) పడకేసిన పారిశుద్ధ్యం అని ప్రజలు తెలుపుతున్నారు. బెజ్జూర్ మండలంలోని సలుగుపల్లి గ్రామంలో మురికి కాలువలు పారిశుధ్య లోపంతో కంపు కొడుతున్నాయని ప్రజలు తెలుపుతున్నారు. మురికి కాలువలు చెత్తాచెదారం(trash and debris) తొలగించకపోవడంతో నీరు ఎక్కడికి అక్కడే నిలిచిపోవడంతో దుర్వాసన ఈగలు, దోమలు విపరీతంగా పెరిగాయని ప్రజలు తెలుపుతున్నారు.
మురికి కాలువలు నిండిపోయి ఉండడంతో ఆ నీరు కాలువల నుండి బయటికి రావడంతో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీ ప్రజలు తెలుపుతున్నారు. గ్రామంలో మిషన్ భగీరథ పైప్లైన్ కొమురం భీం విగ్రహం సమీప నుండి పలుచోట్ల లీకేజీలు కావడంతో త్రాగునీరు అంతా వృధా అవుతుందని ప్రజలు తెలుపుతున్నారు.
మురికి కాలువలలో మురికి నీరు నిలిచి ఉండడంతో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇట్టి విషయమై ఉన్నత అధికారులు వెంటనే స్పందించి మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారంను తొలగించేలా చర్యలు తీసుకునేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మురికి కాలువలలో పేరుకుపోయిన చెత్తను తొలగించి, బ్లీచింగ్ పిచికారి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.